Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఆలోచనా విధానం మారిందంటున్న సమంత!
  • తాజా వివాదంలో కమలహాసన్ చిత్రం 
  • లక్కీ ఛాన్స్ కొట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో!
*  ఇప్పుడు కథానాయికలకు కూడా మంచి పాత్రలు లభిస్తున్నాయని అంటోంది చెన్నై బ్యూటీ సమంత. "మంచి పాత్రలు రాకపోతే సినిమాలు చేయకూడదని గతంలో అనుకునే దానిని. అయితే, అదృష్టం కొద్దీ ఇప్పుడు నాకే కాదు, హీరోయిన్లందరికీ కూడా మంచి స్టఫ్ వున్న పాత్రలు వస్తున్నాయి. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అందుకే సినిమాలు చేసే విషయంలో కూడా నా ఆలోచనా ధోరణి మారింది" అని చెప్పింది సమంత.
*  కమలహాసన్ రూపొందించిన 'విశ్వరూపం 2' చిత్రం వివాదంలో పడింది. ఈ నెల 10న విడుదల కావలసిన ఈ చిత్రాన్ని నిలుపుదల చేయాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ పిరమిడ్ సైమిరా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. గతంలో మధ్యలో ఆగిపోయిన 'మర్మయోగి' చిత్రం కోసం కమల్ తమ నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించే వరకు 'విశ్వరూపం 2' చిత్రాన్ని విడుదల కాకుండా ఆపాలంటూ సదరు సంస్థ తమ పిటిషన్ లో కోరింది.
*  'ఆర్ఎక్స్ 100' చిత్రం ద్వారా యువతను ఆకట్టుకున్న హీరో కార్తికేయ తన తదుపరి చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను బ్యానర్లో చేయనున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందే ఈ చిత్రానికి టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తాడు.
Samantha
Kamal Haasan
RX100

More Telugu News